BHPL: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన కిష్టయ్య ఇవాళ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌ను కలిశారు. భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉండాలని అధికార ప్రతినిధికి వారు సూచించారు. ఈ సందర్భంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి ఉన్నారు.