MHBD: పెద్దవంగర మండల కేంద్రంలోని వారాహి హాస్పిటల్‌ను DMHO రవి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందించొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యులే చికిత్స అందించాలని సూచించారు. ఆస్పత్రులకు అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందేనని, అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.