ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4గా నమోదు అయింది. దీంతో ఇండోనేషియా, ఫిలిపిన్స్, మలేషియా దేశాలకు వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.