NLG: నకిరేకల్‌కు చెందిన ‘లిటిల్ సోల్జర్స్’ ఫౌండేషన్ మానవత్వం చాటుకున్నారు. అటిజంతో బాధపడుతున్న ఏడేళ్ల హయాన్ చంద్ర దీనస్థితి గురించి ఫౌండేషన్ సభ్యులు బ్రహ్మదేవర నరేష్, మట్టిపల్లి వెంకన్న.. ఆదివారం సూర్యాపేటలోని బాలుడి ఇంటికి వెళ్లి రూ.22,200 లు ఆర్థిక సాయం అందించారు. ఆపదలో అండగా నిలిచిన లిటిల్ సోల్జర్స్ సభ్యులకు బాలుడి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.