ADB: సీసీ కెమెరాలతో నేరాలను తగ్గించవచ్చునని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రం నందు జరిగిన దొంగతనం కేసు వివరాలను SP అఖిల్ మహాజన్ బుధవారం వివరించారు. డబ్బుపై వ్యామోహంతో కూతురితో కలిసి దేవల లక్ష్మి అనే మహిళ పది తులాల బంగారం, వెండిని దొంగలించినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.