MNCL: బెల్లంపల్లి పట్టణం 15వ వార్డ్ టేకులబస్తిలో గల అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన పోషణ పక్వాడ్ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతల వసంత సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా డాక్టర్ శిరీష పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోషక ఆహారం గురించి తల్లులకు, పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు హాజరయ్యారు.