GDWL: అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం డిజిటల్ క్లాస్ రూములను ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య, సరైన వసతులు అందుతాయని ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జయరాముడు, వైస్ ఛైర్మన్ విక్రమ్, కో-ఆప్షన్ సభ్యుడు కృష్ణమూర్తి, కౌన్సిలర్ మోహన్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.