HYD గాంధీ సరోవర్ అంశంపై ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుంది. గండిపేట మండలం బండ్లగూడ జాగీర్‌లో 10.34 ఎకరాల్లో గాంధీ సరోవర్ అభివృద్ధికి అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో కొంత వక్ఫ్ బోర్డుకు చెందినవి కాగా, మిగతా భూముల సమీకరణపై ప్రభుత్వం చర్చలు జరిపి త్వరలో చర్యలు చేపట్టనుంది. ఇటీవలే మధు రిడ్జ్ పార్కు వాసులు సానుకూలత వ్యక్త పరచినట్లు ప్రభుత్వం పేర్కొంది.