VKB: బసవ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం, న్యాయం కోసం బసవన్న చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. కుల వివక్ష లేని సమాజాన్ని నిర్మించేందుకు ఆయన బోధనలు నేటికీ ప్రేరణగా నిలుస్తున్నాయని, ప్రతిఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని కోరారు.