NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో పనిచేస్తున్న అతిధి అధ్యాపకులు తమ సర్వీసును వచ్చే విద్యా సంవత్సరానికి (2026-27) కూడా కొనసాగించాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమావత్ రవికి శనివారం వినతిపత్రం అందజేశారు. కళాశాల అతిథి అధ్యాపక సంఘం అధ్యక్షులు బీ. సురేష్ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.