HYDలో ఎండలు భగభగ మండుతున్నాయి. వాతావరణ శాఖ చెప్పినట్లే జరుగుతోంది. ఉమ్మడి HYD, RR జిల్లాల్లో రెండు రోజుల్లో 40 డిగ్రీలు దాటుతుందని చెప్పగా.. నేడు శంకర్పల్లి పరిధి ప్రొద్దుటూరులో 40.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వెల్లడించింది. మరోవైపు HYD జిల్లా పరిధిలో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.