ADB: ఉపాధి హామీ పనుల పర్యవేక్షణకు NMMS యాప్ వినియోగం కొనసాగుతోందని టీఏ అధికారులు వెల్లడించారు. ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌లో జరుగుతున్న కూలీలు పని సమయంలో రెండుసార్లు ఫొటోలతో హాజరు నమోదు చేయాలని సూచించారు. నెట్ సమస్యల వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ, హాజరు నమోదు కాకపోతే వేతనాల్లో కోత పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.