KMR: తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశ నిర్ణయాలపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలోని పోడు రైతుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ విక్టర్ ఉన్నారు