NLG: ఎండల తీవ్రతతో నీరు లభించక అల్లాడుతున్న పక్షుల దాహం తీర్చేందుకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మానవత్వాన్ని చాటుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలోని చెట్ల కొమ్మలకు నీటి తొట్లు, డబ్బాలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో సిబ్బంది వెంటనే నీటి వసతి కల్పించగా, పక్షులు దాహం తీర్చుకుంటున్నాయి. కలెక్టర్ చూపిన ఈ చొరవ ప్రశంసలందుకుంటుంది.