మంచిర్యాల: జన్నారం మండలంలో తీవ్ర సమస్యగా ఉన్న కోతులను పట్టి సురక్షిత ప్రాంతాలకు వదిలేయడమే మంచి పరిష్కారమని జన్నారం అటవీశాఖ అధికారులు అన్నారు. మండలంలో ప్రతినెలా 350 నుండి 400 మందిని కోతులు కరుస్తున్నాయి. దీంతో వారికి యాంటీ రేబిస్ ఇంజక్షన్లను వైద్య సిబ్బంది ఇస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని యాంటీ రెబిస్ వ్యాక్సిన్ వినియోగం జన్నారం మండలంలోని ఎక్కువగా ఉంది.