MDCL: అల్వాల్ సర్కిల్ గోల్నాకా కూడలిలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాలను వారు స్మరించుకున్నారు. నాటి సోనియా గాంధీ చారిత్రాత్మక సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు.