MNCL: వేమనపల్లి మండలం దస్నాపూర్‌లో గురువారం బాలిక విద్యుత్ షాక్‌కు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్ల రామగౌడ్ ఇంట్లో గజ్జల స్ఫూర్తి ప్రమాదవశాత్తు ఫ్రిజ్‌ను తాకగా విద్యుత్ షాక్ తగిలి స్పృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది తక్షణమే చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.