HNK: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ నడికూడ రైతు వేదికలో మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీడీవో రామ రామకృష్ణ తెలిపారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ పథకాల అమలు, పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంపొందించడానికై మండల స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, మండల స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో కోరారు.