ADB: ప్రభుత్వం ఏదైనా అంతిమంగా ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ MLA పాయల శంకర్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రజల వద్దకు వచ్చి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.