RR: సరూర్ నగర్ రైతుబజార్‌కు నేడు సెలవు ఉంటుందని రైతుబజార్ ఈవో స్రవంతి తెలిపారు. ప్రతినెల మూడో బుధవారం సెలవు ఉన్నందున ఈరోజు రైతు బజార్లో కూరగాయల క్రయ విక్రయాలు జరగవన్నారు. గురువారం మళ్లీ యధావిధిగా రైతుబజార్లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.