KMR: భిక్నూర్ సిద్ద రామేశ్వర ఆలయ కమిటీ ఛైర్మన్, ఆలయ డైరెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ ఛైర్మన్ పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. సమస్యలు విన్న షబ్బీర్ అలీ వెంటనే స్పందించి ఎండోమెంట్ అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.