NZB: బోధన్ పట్టణంలోని అన్ని కాలనీల్లో నేడు (11.04.2026) మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈవిషయం గమనించి వినియోగదారులు సహకరించవలసిందిగా AE నాయిని కృష్ణ విజ్ఞప్తి చేశారు.