గద్వాల్ జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన కోసం ఏప్రిల్ 13 నుంచి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, హెల్మెట్, సీటుబెల్ట్ అవగాహన, గోల్డెన్ అవర్ చికిత్సపై శిక్షణ ఇస్తారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పిలుపునిచ్చారు.