BHPL: “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ఇవాళ గోరికొత్తపల్లి మండల కేంద్రంలో MPDO రాంప్రసాద్ అధ్యక్షతన మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 16 గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శిలు ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని MPDO సూచించారు.