SRCL: చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్, జీయంఆర్ వరలక్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని డాక్టర్ చెన్నమనేని దీప వికాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల సాధికారతకు విద్య, నైపుణ్యాభివృద్ధి ఎంతో ముఖ్యమని తెలిపారు. గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి పొందడానికి కుట్టు మిషన్ ఉపయోగపడుతుందన్నారు.