NLG: బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శంషాబాద్లో ఇవాళ నిర్వహించిన నేషనల్ మేనేజింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ మీటింగ్ 2025–26కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘విజన్ 2047’తో రోడ్లు, భవనాల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో బిల్డర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.