NZB: ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితులపై వారు చర్చించారు. అనంతరం డాక్టర్ నాగమోహన్ మాట్లాడుతూ.. ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.