IPLలో శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్న టీమిండియా టీ20 జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో శ్రేయస్‌ను ఉద్దేశించి మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిని సెలక్టర్లు భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతానని తెలిపాడు. తనతో పాటు మిగిలిన వాళ్లు కూడా వచ్చి నిరసన తెలపాలని పేర్కొన్నాడు. అతడి కోసం ఫైట్ చేయాలని చెప్పుకొచ్చాడు.