రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమీ బిందర్కు BCCI షాక్ ఇచ్చింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా డగౌట్లో ఆయన మొబైల్ ఫోన్ ఉపయోగించడంతో క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీనిపై ఆయన బీసీసీఐకి వివరణ ఇచ్చినప్పటికీ, ఆ వివరణపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, ఇది మొదటి తప్పు కావడంతో తీవ్రంగా పరిగణించకుండా, రూ. లక్ష జరిమానా విధించి హెచ్చరించింది.