వాంఖడేలో రాత్రి జరిగిన MI vs RCB మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్ గాయపడినట్లుగా తెలుస్తోంది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీకి చిలమండ గాయమైందని, ఈ కారణంగానే ఫీల్డింగ్ చేయలేదని సమాచారం. అటు రోహిత్ కూడా 19* రన్స్ వద్ద తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వారి గాయాల తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.