యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఆ కుర్రాడిని ప్రశాంతంగా ఆడుకోనివ్వండి.. ఇప్పుడే అతడిపై అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని మోపకండి. ఆటను నేర్చుకునేందుకు, తనను తాను మెరుగుపరుచుకునేందుకు అతడికి ఇంకా కాస్త సమయం ఇవ్వాలి’ అని సూచించాడు. సీనియర్ ప్లేయర్ గాయపడిన సమయంలో అతడికి అవకాశం ఇవ్వడం ఉత్తమమని పేర్కొన్నాడు.