ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌పై దృష్టి పెట్టడం కోసం ఈ ఏడాది IPLకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. గత వేలంలో రూ.2 కోట్లతో DC డకెట్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడు అతడు టోర్నీ నుంచి తప్పుకోవడంతో BCCI నిబంధనల ప్రకారం 3 ఏళ్ల పాటు IPL ఆడకుండా నిషేధం విధించే అవకాశం ఉంది.