కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి మ్యాచ్ ఫలితాన్ని మలుపు తిప్పడంలో ముంబై బౌలర్ బుమ్రా ముందుంటాడు. అయితే గత 5 మ్యాచ్‌లుగా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. గతేడాది పంజాబ్‌తో క్వాలిఫైయర్ మొదలు.. రాత్రి RCBతో మ్యాచ్ వరకు ఒక్క వికెట్ కూడా తీయలేదు. మొత్తం 20 ఓవర్లలో 163 రన్స్ సమర్పించుకున్నాడు. దీంతో బుమ్రా త్వరగా పుంజుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.