ఏప్రిల్ 5న RCBతో జరిగిన మ్యాచ్ విషయంలో BCCIకి CSK ఫిర్యాదు చేసింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. మ్యాచ్ సమయంలో బెంగళూరు స్టేడియం DJ ‘దోశ, ఇండ్లీ, సాంబర్’ పాటను ప్లేచేశాడు. దీన్ని వినిపించిన సందర్భం సరైనదని కాదని, తమను కించపరచడమేనంటూ CSK ఫిర్యాదులో పేర్కొంది. చెన్నై టీమ్ నుంచి ఫిర్యాదు అందినట్లు ఓ BCCI అధికారి కూడా ధ్రువీకరించినట్లు సదరు మీడియా పేర్కొంది.