ముంబై మ్యాచులో బ్యాటింగ్ చేస్తుండగా కోహ్లీ గాయపడ్డాడని, అందుకే ఫీల్డింగ్ చేయలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై RCB ప్లేయర్ కృనాల్ పాండ్యా స్పందిస్తూ.. ‘కోహ్లీ గాయంపై ఇంకా ఫిజియోతో మాట్లాడలేదు. కానీ అతను బాగానే ఉన్నాడని భావిస్తున్నా. దీనిపై కంగారు పడాల్సిన అవసరం లేదు’ అని తెలిపాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ పాటీదార్ కూడా కోహ్లీ బాగానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.