T20 WCలో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ‘బ్యాటర్లందరూ తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. బ్యాటింగ్ పరంగా మా ప్రదర్శనలో ఎలాంటి లోటే లేదు. కానీ బౌలింగ్‌లో మేం ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉండాల్సింది. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు మా లోపాలను సరిదిద్దుకుంటాం’ అని తెలిపాడు.