ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 19వ సీజన్ ప్రారంభ తేదీ ఖరారైంది.IPL-2026 సీజన్ మార్చి 28న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అధికారిక బ్రాడ్‌కాస్టర్ ‘స్టార్ స్పోర్ట్స్’ వెల్లడించింది. మే 31, 2026 వరకు ఈ లీగ్ కొనసాగనుంది. గతేడాది (2025) టైటిల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), తమ సొంత గడ్డపైనే ఈ సీజన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.