ఐపీఎల్ 2026లో KKR ఆల్రౌండర్ కెమెరూన్ గ్రీన్ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్ల్లో వరుసగా 18, 2, 4, 32, 0 పరుగులతో కలిపి మొత్తం 56 రన్స్ మాత్రమే చేశాడు. బౌలింగ్లో ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీంతో రూ.25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన అతడికి, రూ.25 లక్షలు కూడా ఎక్కువే అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.