చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా KKR, CSK జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన KKR బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన ఈ జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. గత మ్యాచ్లో ఢిల్లీపై గెలిచిన CSK అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు ఈ సీజన్లో తొలి విజయాన్ని సాధించాలని KKR పట్టుదలగా ఉంది.