MI వరుస ఓటములతో కెప్టెన్ పాండ్యాపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో కోచ్ జయవర్దనె కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓటములకు పాండ్యాను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని అన్నాడు. ఇది జట్టు మొత్తం సమిష్టి వైఫల్యమని వ్యాఖ్యానించాడు. వ్యక్తిగతంగా ఎవరినీ దోషులుగా వేలెత్తి చూపలేమని తెలిపాడు. రాబోయే మ్యాచ్ల్లో తప్పులను సరిదిద్దుకుని మళ్ళీ విజయాల బాట పడతామని ధీమా వ్యక్తం చేశాడు.