IPL తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందని, భారత ఆతిథ్యం అద్భుతమని జింబాబ్వే కెప్టెన్ సింకదర్ రజా పేర్కొన్నాడు. PSLలో లాహోర్ తరఫున ఆడుతున్న రజా.. పంజాబ్(IPL 2023 & 24)కు ఆడేటప్పుడు అందరూ స్నేహంగా ఉండేవారని, వాళ్ల ఇంటికీ వెళ్లానని తెలిపాడు. కాగా 1986లో పంజాబ్(పాక్) సియాల్కోట్లో రజా జన్మించగా.. అతనికి 18 ఏళ్లప్పుడు అతని కుటుంబం జింబాబ్వేకు వలస వెళ్లింది.