MBNR: నవాబుపేట మండలం కాకజ్జాల తండాలో ప్రభుత్వం నిర్మించిన వాటర్ ట్యాంక్ ఆరు సంవత్సరాలుగా వాడుకలో లేకపోవడంతో గ్రామ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న ట్యాంక్ సమస్యను గుర్తించి వెంటనే వినియోగంలోకి తేవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.