TG: రాష్ట్రంలో కులాంతర వివాహాలు పరిమితంగానే ఉన్నప్పటికీ.. కొన్ని వర్గాల్లో మార్పు కనిపిస్తోంది. అయ్యంగార్లులో 12 శాతం కులాంతర వివాహాలు జరిగాయి. ఎస్సీ క్రిస్టియన్లు(9.9శాతం), రాజులు(8.7శాతం) కూడా ఈ దిశలో ముందంజలో ఉన్నారు. బీసీ-ఎ గంగిరెద్దులవారు, అగ్నికుల క్షత్రియులు, ఓసీ కాపులు, బ్రాహ్మణుల వంటి వర్గాల్లో ఈ ధోరణి పెరుగుతోంది. వెలమలు, రెడ్లలో తక్కువ కులాంతర వివాహాలు జరిగాయి.