సత్యసాయి: హిందూపురం మండలం కొట్నూర్ రైల్వే గేట్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిట్ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు హిందూపురం నుంచి బైకులో వస్తుండగా జేసీబీనీ ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మడకశిరకు చెందిన భరత్, గోరంట్లకు చెందిన అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.