అదృష్టం అంటే ఇతనిదే! పది కోట్ల విలువైన పికాసో పెయింటింగ్ ఒక వ్యక్తికి కేవలం 11 వేలకే దక్కింది. నిధుల సేకరణ కోసం నిర్వహించిన ఆన్లైన్ లాటరీలో పారిస్‌కు చెందిన అరీ హోదారా ఈ అదృష్టాన్ని గెలుచుకున్నారు. లక్షకు పైగా టికెట్లలో ఆయన తీసిన టికెట్‌కే ఈ ఖరీదైన పెయింటింగ్ దక్కడం విశేషం.