JGL: మల్యాల మండలం కేంద్రంలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో స్వాతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఆర్డీవో రఘువరన్ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.