NGKL: వంగూరు మండలంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. ఈ పాఠశాలలో జరుగుతున్న నిర్మాణ పనులు, విద్యా ప్రమాణాలు, సదుపాయాలను సమీక్షించారు. MEO కొండల్ రెడ్డి కలెక్టర్‌కు పాఠశాల కార్యకలాపాల వివరాలను తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.