BHPL: మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లి సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను జిల్లా అధికారులు పరిశీలించారు. ఈనెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ బ్యారేజీ ప్రాంతాన్ని పరిశీలించారు.