NZB: CP ఆదేశాల మేరకు బోధన్‌లో ‘పోలీస్ అక్క’ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. మహిళా పోలీసులు యాదమ్మ, లావణ్య రాకాసిపేటలోని బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న సిబ్బంది.. ధైర్యం నింపేందుకు రాత్రి వేళల్లో హాస్టల్లోనే బస చేస్తున్నారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని బోధన్ SHO తెలిపారు.