‘పుష్ప’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో వస్తున్న ‘రాకా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా, గతంలో షారుఖ్‌తో అట్లీ తీసిన ‘జవాన్’ మూవీ భారీ విజయం సాధించింది.